సిరాన్యూస్, ఉట్నూర్
నిత్యవసర సరుకులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వేడ్మ బొజ్జు పటేల్
మండలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం ఖానాపూర్ ఎమ్మెల్యే వేడ్మ బొజ్జు పటేల్ రంజాన్ పండుగ సందర్భంగా నిరుపేద ముస్లిం కుటుంబాలకు నిత్యవసర సరకుల కిట్లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మాట్లాడుతూ రంజాన్ పండుగ సందర్భంగా నిరుపేద ముస్లింల జాబితా తయారు చేసి, ఆ జాబితా ప్రకారంగా భర్తలు కోల్పోయిన ఒంటరి మహిళలకు, నిస్సాయస్థితిలో ఉన్న నిరుపేద ముస్లిం కుటుంబాలకు తన వంతుగా ఉట్నూర్ పట్టణంలో 200 మందికి, అదే విధంగా నియోజకవర్గం మొత్తంలో 500 మందికి నిత్యవసర కిట్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. దాతలు సైతం ముందుకు వచ్చి ఇలాంటి నిరుపేదలకు సహాయం చేయాలని ఆయన కోరారు.ఉగాది క్రోధి నామ నూతన సంవత్సరం అందరికీ మంచి కలగాలని పంటలు బాగా పండాలని అన్నారు. హిందూ, ముస్లిం ,సిఖ్, ఇసాయి అన్ని వర్గాల ప్రజలు కలసి మెలసి ఉంటు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, నిరుపేద మైనార్టీ ప్రజలు పాల్గొన్నారు.