సిరాన్యూస్, ఖానాపూర్
కాంగ్రెస్ పార్టీతోనే సబ్బండ వర్గాలకు న్యాయం : ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
*పలు కాలనీల్లో తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే
సబ్బండ వర్గాల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. శనివారం పట్టణంలో పొద్దుపొడుపు బొజ్జన్న అడుగు(మార్నింగ్ వాక్) కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ కాంగ్రెస్ నాయకులతో కలిసి పలు కాలనీల్లో తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకున్నారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల సంక్షేమాన్ని కోరే కాంగ్రెస్ పార్టీతోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం అనేక ప్రతిష్టాత్మకమైన సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. కాలనీలలో నెలకొన్న సమస్యలను దశల వారిగా పరిష్కారం చేస్తామన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఆత్రం సుగుణను భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.