సిరా న్యూస్,ఉట్నూర్
మెరుగైన వైద్యాన్ని అందించాలి
* ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
* బాధిత కుటుంబానికి రూ.50వేలు ఆర్థిక సహాయం
మెరుగైన వైద్యాన్ని అందించాలని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలో గల ముంజం మల్లేష్ హైదరాబాద్ యశోద హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకుని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సోమవారం రాత్రి బాధితుడిని పరామర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్య పరిస్థితులపై కుటుంబ సభ్యులతో మాట్లాడి అడిగి తెలుసుకున్నారు. అలాగే వైద్యులతో మాట్లాడి బాధితుడికి మెరుగైన వైద్యాన్ని అందించాలని సూచించారు. ఆర్థికంగా రోగికి ఇబ్బందులకు గురి చేయొద్దన్నారు. ప్రభుత్వపరంగా అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామన్నారు .ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులకు 50 వేల ఆర్థిక సహాయాన్ని తనవంతుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.