Vedma Bojju Patel: కిక్ బాక్సింగ్ క్రీడాకారినికి ఎమ్మెల్యే ఆర్థిక సహాయం

సిరాన్యూస్‌,ఖానాపూర్
కిక్ బాక్సింగ్ క్రీడాకారినికి ఎమ్మెల్యే ఆర్థిక సహాయం

నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో సింగపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని నాగలక్ష్మి అనే విద్యార్థిని కిక్ బాక్సింగ్లో రాణిస్తూ నేషనల్ ఛాంపియన్ పోటీలకు ఎంపికైంది. ఈ విషయం తెలుసుకున్న ఖానాపూర్ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ క్రీడాకారినికి 20,000 ఆర్థిక సాయం అంద‌జేశారు. ఈ కార్యక్రమంలో ఖానాపూర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దోనికిని దయానంద్, జ‌డ్పీటీసీ సభ్యులు ఆకుల వెంక గౌడ్, ఖానాపూర్ పట్టణ అధ్యక్షులు నిమ్మల రమేష్, ఎంపీటీసీ సభ్యులు జంగిలి శంకర్, మేడంపల్లి సర్పంచ్ రాజు నాయక్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు పోలంపల్లి సచిన్ నాయకులు మాధవ్ ,హైదర్ శంకర్,చరణ్, సింగపూర్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *