సిరా న్యూస్,కడెం
తరగతి గదిలోనే దేశ భవిష్యత్తు నిర్మాణం: ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
* కడెంలో జయశంకర్ బడిబాట
తరగతిగదిలో దేశ భవిష్యత్తు నిర్మాణం అవుతుందని,ప్రవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను రాష్ట్ర ప్రభుత్వం అద్భుతంగా తీర్చిదిద్దెందుకు కృషి చేస్తోందని ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. నిర్మల్ జిల్లా కడెం మండలంలోని జడ్పీఎస్ఎస్ పాఠశాలలో ప్రో. జయశంకర్ బడిబాట కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను బలోపేతం చేయడం కోసం స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతుందన్నారు. పాఠశాలలను అన్ని విధాలుగా అభివృద్ధి పరచడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు.ప్రతి పేదవాడికి నాణ్యమైన అందించేందుకు కృషి చేస్తున్నమని పేర్కొన్నారు. అత్యాధునిక టెక్నాలజీ వాడి విద్యా బోధనను అందిస్తున్నామని పేర్కొన్నారు. పాఠశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తామన్నారు.అనంతరం విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, దుస్తులు అందజేశారు. పదవ తరగతిలో మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులను శాలువాతో సన్మానం చేశారు.ఈ కార్యక్రమంలో అధికారులు,ఉపాధ్యాయులు,విద్యార్థులు, తల్లితండ్రులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.