సిరాన్యూస్, ఉట్నూర్
పేద ప్రజల పెన్నిధి మంత్రి సీతక్క : ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
* ఘనంగా మంత్రి సీతక్క జన్మదిన వేడుకలు
పేద ప్రజల పెన్నిధి పంచాయతీ రాజ్, శిశు సంక్షేమ శాఖ జిల్లా ఇంచార్జి మంత్రి సీతక్క అని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంత్రి ధనసరి సీతక్క జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా కేక్ కట్ చెసి కాంగ్రెస్ నేతలకు తినిపించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల శ్రేయస్సు కోరే ప్రజా నాయకురాలు మంత్రి సీతక్క అని అన్నారు. నిరంతరం పేదల పక్షాన నిలబడతారని పేర్కొన్నారు. తాడిత పిడిత వర్గాల అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి మంత్రి సీతక్క ఎనలేని కృషి చేస్తున్నారన్నారు. ఈ సందర్బంగా మంత్రి సీతక్కకు ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ తో పాటు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.