సిరాన్యూస్,ఉట్నూర్
రైతు భరోసా పథకంపై అభిప్రాయాలను తెలపాలి: ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ లో నిర్వహించే రైతు భరోసా పథకంపై రైతుల అభిప్రాయాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడారు. గురువారం ఉదయం 10గంటలకు ఉట్నూర్ మండలంలోని కేబి కాంప్లెక్స్ లో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు పంచాయతీ రాజ్, శిశు సంక్షేమ శాఖ జిల్లా ఇంచార్జి మంత్రి సీతక్క, వ్యవసాయ, మార్కెటింగ్ సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, రెవెన్యూ,హౌజింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రానున్నట్టు తెలిపారు. జిల్లా నలుమూలల నుండి రైతులు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. రైతు భరోసా పథకంపై మీ యొక్క అభిప్రాయాలను తెలియజేయడానికి ప్రభుత్వం మంచి అవకాశం కల్పించిందని, ప్రతి ఒక్క రైతు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.