సిరా న్యూస్, ఖానాపూర్:
నియోజకవర్గ అభివృద్ధికి నడుం బిగించాలి…
ఖానాపూర్ నియోజకవర్గ అభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు నడుం బిగించాలని నిర్మల్ జిల్లా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ అన్నారు. మంగళవారం ఖానాపూర్ మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… గ్రామాల్లో ఏండ్లుగా నెలకొని ఉన్న సమస్యల పరిష్కారానికి దశలవారీగా కృషి చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా వివిధ శాఖల వారీగా అధికారుల పనితీరుపై సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయిలో పనిచేసే అధికారులంతా ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని అన్నారు. కార్యక్రమంలో ఖానాపూర్ ఎంపీపీ అబ్దుల్ మోహిత్ ఎంపీడీవోమల్లేష్, తహాసిల్దార్ భౌమిక్, గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, పాల్గొన్నారు.