సిరా న్యూస్, బ్యూరో–ఇన్- చీఫ్, నిర్మల్:
సింప్లిసిటీకి మారు పేరుగా వెడ్మా బొజ్జు..
+ కార్యకర్తలతో కలిసి బస్సులో నాగ్‌పూర్‌కు ప్రయాణం
+ అంతకు ముందు రిమ్స్‌లో చికిత్స
+ ఆయన సింప్లిసిటీకి ఫిదా అవుతున్న ఫ్యాన్స్
+ వాట్ ఏ లీడర్ అంటున్న కార్యకర్తలు
ఈ రోజుల్లో చిన్న చిన్న గ్రామాల సర్పంచ్‌లు సైతం కార్లలో తిరుగుతూ, విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. సాదారణంగా రాజకీయ నాయకులు అంటేనే కార్లు, కాన్వాయ్‌లు, మందీ, మార్బలం ఈ రోజుల్లో తప్పనిసరి అయ్యింది. అలాంటిది ఎమ్మెల్యే అంటే వేరే చెప్పనక్కర్లేదు. అయితే అందరూ అలానే ఉంటారు అనుకుంటే పొరపాటే. అక్కడక్క కొంత మంది, తాము ఎంత ఉన్నతంగా ఎదిగిన కూడ ఒదిగి ఉండటం కనిపిస్తూ ఉంటుంది. అలాంటి కోవకు చెందిన వ్యక్తే… ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్. ఒక సాధారణ ఆదివాసీ రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆయన ఇందిరమ్మ ఇంట్లో ఉండేవాడు. చాలా చిన్న స్థాయి నుంచి వచ్చి, ఇటీవల జరిగిన ఎన్నికల్లో నిర్మల్ జిల్లా ఖానాపూర్ నుంచి కాంగ్రేస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచి అందరి చేత వావ్ అనిపించుకున్న ఆయన, ప్రస్తుతం తన సింప్లిసిటీతో వార్తల్లో నిలుస్తున్నారు.
సామాన్య కార్యకర్తలాగా..
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో నిర్వహించిన కాంగ్రేస్ పార్టి ఆవిర్భావ దినోత్సవానికి ఆయన కార్యకర్తలతో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణించడం అందరిని ఆకట్టుకుంది. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చేతికి క్యానుల ధరించి మరీ, మంత్రి సీతక్కతో కలిసి వివిద కార్యక్రమాల్లో పాల్గొన్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అది మరవక ముందే ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఫోటోలు, వీడియోలు బయటకు రావడంతో అభిమానులు, పార్టీ శ్రేణులే కాక సామాన్య ప్రజలు సైతం ఎమ్మెల్యేను పొగడకుండా ఉండలేకపోతున్నారు. వావ్.. వాట్ ఏ లీడర్..! అంటూ కితాబిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడ సామాన్య జనంతో మమేకమయ్యే ఎమ్మెల్యే తమకు దొరకడం అదృష్టమని ఖానాపూర్ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రానున్న రోజుల్లో సైతం ఇలానే ప్రజల మద్యన ఉంటూ.. వారి సమస్యలు తీర్చాలని అంతా కోరుకుంటున్నారు.