సిరాన్యూస్, హుస్నాబాద్
క్రీడలతోనే మానసికోల్లాసం: వేముల సాయికుమార్
* బెస్ట్ వాలీబాల్ క్రీడాకారుడికి ఘన సన్మానం
క్రీడలతోనే మానసికోల్లాసం కలుగుతుందని బెస్ట్ వాలీబాల్ క్రీడాకారుడు వేముల సాయికుమార్ అన్నారు. బుధవారం హుస్నాబాద్ శుభం గార్డెన్ లో జరిగిన క్రీడ సమీక్ష సమావేశంలో సైదాపూర్ మండలానికి చెందిన వేముల సాయికుమార్ పాల్గొన్నారు. ఈసందర్భంగా అభివృద్ధి కమిటీ చైర్మన్ కేడం లింగమూర్తి ఆధ్వర్యంలో ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం వేముల సాయికుమార్ మాట్లాడుతూ క్రీడలు ఆడటం వలన మానసిక ఉల్లాసం, శారీరక ఒత్తిడి దూరమవుతుందని తెలిపారు. శరీరంలో వచ్చే బీపీ, షుగర్ లను అలాగే మానసిక పరిస్థితిని మెరుగుపరుస్తుందని అన్నారు. కార్యక్రమంలో నాగిరెడ్డి సిద్ధారెడ్డి, కమిటీ సభ్యులు వెన్న రాజు, ప్రత్యేక కోచ్ మడక కృష్ణ, మల్లం సాయి కృష్ణ, క్రీడ పోషకులు వెనమల్ల బన్నీ, మద్దెల నిఖిల్, టి.రోషన్, వి.రోహిత్, బి.మధు, జి శ్రీనాథ్, తదితరులు పాల్గొన్నారు.