సిరా న్యూస్, సైదాపూర్:
త్వరలో ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చార్జీలు పెంపుకు చర్యలు
* రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ వేముల శ్రీనివాస్
మరికొద్ది రోజుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూముల ధరలు, రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచబోతుందని రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ వేముల శ్రీనివాస్, ఇరాల రజనీకాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో భూమి ధరలు పెరుగుతున్న సందర్భంగా కేశవపట్నం, చిగురుమామిడి, భీమదేవరపల్లి, హుస్నాబాద్, హుజురాబాద్ మండలాల కంటే తక్కువ ధరలో కమర్షియల్ లాండ్ సైదాపూర్ మండలంలోని లభిస్తుందని అయన అన్నారు. హుజురాబాద్ టు హుస్నాబాద్ రోడ్డు రానున్న రోజుల్లో విస్తరిస్తున్న నేపథ్యంలో సైదాపూర్ మండల పరిధిలో ఫంక్షన్ హాల్, రైస్ మిల్, కోళ్ల ఫారం, హోటల్, రెస్టారెంట్ ల మీద పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయమని ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ వేముల శ్రీనివాస్, చీరాల రజనీకాంత్ అన్నారు.