సిరా న్యూస్,వేములవాడ;
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపాలిటీ బీఆర్ఎస్ సభ్యుల్లో ముసలం మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవం చూసిన బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆలోచన లో పడినట్టు సమాచారం. ఎన్నికల ఫలితాలు వెలువడడంతోనే మున్సిపల్ వైస్ చైర్మన్ మధు రాజేందర్ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లలో ఉన్న అసంతృప్తి, అసమ్మతి బయటపడింది. ఎన్నికలలో భాగంగా వేములవాడ మున్సిపల్ పరిధిలోని 28 వార్డు లో ఓటింగ్ సరళి పై వచ్చిన ఫలితాల ను సమీక్షుంచుకున్నసదరు నాయకులు తమ భుజాలను తుడుముకుంటున్నట్లు తెలుస్తోంది. బిఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసిన లక్ష్మీనరసింహారావు ఓటింగ్ సరళిపై సమీక్షించి అనంతరం జరిగిన పరిణామాలతో ఏకంగా మున్సిపల్ వైస్ చైర్మన్ తన పదవికి రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది.