సిరా న్యూస్,హైదరాబాద్;
సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వేములవాడ ఆలయ అర్చకులు కలిసి ఆశీర్వచనం అందించారు. ముఖ్యమంత్రిని కలిసినవారినలో ఆలయ ఈవో వినోద్, స్థపతి వల్లినాయగం, ఈఈ రాజేష్, డీఈఈ రఘునందన్, ఆలయ ప్రధాన అర్చకులు ఉమేష్ శర్మ, తదితరులు వున్నారు. వేములవాడ ఆలయ విస్తరణకు బడ్జెట్ లో రూ.50కోట్లు కేటాయించినందుకు సీఎంకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఆలయ అర్చకులు, అధికారులు కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ విస్తరణ కు సంబంధించిన డిజైన్స్, నమూనా కు శృంగేరి పీఠం అనుమతి తీసుకోవాల్సి ఉందని సీఎంకు తెలిపారు. వెంటనే వెళ్లి శృంగేరి పీఠం అనుమతి తీసుకోవాలని సీఎం ఆదేశించారు.