సిరాన్యూస్, కుందుర్పి
రోడ్లను పరిశుభ్రంగా ఉంచడం మనందరి బాధ్యత: ఎస్సై వెంకట్ స్వామి
రోడ్లను పరిశుభ్రంగా ఉంచడం మనందరి బాధ్యత అని ఎస్సై వెంకట్ స్వామి అన్నారు. అనంతపురం జిల్లా కుందుర్పి మండల కేంద్రంలో ప్రధాన రహదారి కి ఇరువైపులా ఉండే నివాస గృహల నుండి అవసరానికి వాడుకొని కలుషిత నీటిని పైపుల ద్వారా బయటికి వదులుతారు. దీంతో ప్రధాన రహదారి గుండా వెళ్లే ప్రజలు కు చాలా ఇబ్బందిగా ఉందని ప్రజలు పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన ఫలితం లేకుండా పోయింది. గురువారం సబ్ ఇన్స్పెక్టర్ టి పి వెంకటస్వామి ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శి మహబూబ్ భాష, సర్పంచ్ మారుతీశ్వరి రామమూర్తి, ఎం పి డి ఒ చంద్రశేఖర్, హెల్త్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, అందుకు కారకులైన వారి గృహలకు వెళ్లి రోడ్ల పైపి నీరు రాకుండా గుంతలు తీసుకోవాలని లేని యెడల చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.ఇందులో ముఖ్యమైన విషయం మురుగు నీరు అంత ప్రభుత్వ హాస్పిటల్ ముఖద్వారం గుండా ప్రవహిస్తుంది.