సిరాన్యూస్, కళ్యాణదుర్గం
అవినీతి రహిత సేవలను ప్రజలకు అందిస్తాం
* సబ్ రిజిస్టర్ కే. వెంకట నాయుడు
* నూతన సబ్ రిజిస్టర్గా ఉద్యోగ బాధ్యతలు స్వీకరణ
నియోజకవర్గ పరిధిలోని ప్రజలకు కళ్యాణదుర్గం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ప్రజలకు అవినీతికి చోటు లేకుండా అవినీతి రహిత సేవలను అందిస్తామని నూతన సబ్ రిజిస్టర్ వెంకట్ నాయుడు అన్నారు. కళ్యాణదుర్గం పట్టణంలో వెలసిన సబ్ రిజిస్టర్ కార్యాలయంలో నూతన సబ్ రిజిస్టర్ అధికారి కె. వెంకట నాయుడు శనివారం పదవి బాధ్యతలను స్వీకరించారు. ఆయనకు కార్యాలయంలో సిబ్బంది ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నూతన సబ్ రిజిస్టర్ కె. వెంకట నాయుడు మాట్లాడారు. కళ్యాణదుర్గం నియోజకవర్గం ప్రజలకు ,నాయకులకు , మా శ్రేయోభిలాషులకు, మిత్రులకు పాత్రకేయులకు తొలత శుభాకాంక్షలు తెలియజేశారు. ఇది నిర్వహణలో ప్రజా సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేస్తానని తెలిపారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సకాలంలో ప్రజాసేవలును చేరవేస్తానని వివరించారు. ఇంతకు మునుపు ఇక్కడ పనిచేసిన సబ్ రిజిస్టర్ అధికారి అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న విషయంపై సస్పెండ్ అయిన విషయం తెలిసిందే.