Venkata Ramana Reddy: రైతుల సంక్షేమమే సహకార సంఘాల లక్ష్యం

సిరా న్యూస్, చిగురుమామిడి
రైతుల సంక్షేమమే సహకార సంఘాల లక్ష్యం
* రైతుల సమిష్టి కృషితోనే సహకార సంఘం అభివృద్ధి
*  8కోట్ల 67లక్షలు క్రాప్ లోన్లు రైతులకు మంజూరు
*  చైర్మన్ జంగా వెంకట రమణారెడ్డి
*ప్రాథ‌మిక వ్య‌వ‌సాయ స‌హ‌కార సంఘం సర్వసభ్య సమావేశం

రైతుల శ్రేయస్సే సహకార సంఘాల ప్రధాన ధ్యేయమని, రైతులకు రుణాలు అందించేందుకే సహకార సంఘాలు పని చేస్తున్నాయని సింగిల్ విండో చైర్మన్ జంగా వెంకటరమణారెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలో గురువారం జరిగిన ప్రాథ‌మిక వ్య‌వ‌సాయ స‌హ‌కార సంఘం సర్వసభ్య సమావేశం  చైర్మన్ రమణారెడ్డి అధ్యక్షతన జరిగింది.ఈ సర్వసభ్య సమావేశంలో సంఘం కార్యనిర్వాహణ అధికారి కాటం నరసయ్య వార్షిక నివేదికను రైతులకు, సభ్యులకు వివరించగా సభ్యులు ఆమోదం తెలిపారు. అనంతరం చైర్మన్ రమణారెడ్డి మాట్లాడుతూ సంఘం పరిధిలో సభ్యులకు 8కోట్ల 67లక్షల రూపాయల క్రాప్ లోన్, 3కోట్ల 64లక్షల రూపాయల దీర్గకాళిక, కర్షక మిత్ర లోన్ ద్వారా ఇవ్వడం జరిగిందన్నారు. వాయిదా మీరిన క్రాప్ లోను వడ్డీ సభ్యులు చెల్లించి ఋణ మాఫీకి అర్హత పొందగలరని విజ్ఞప్తి చేశారు.గత యాసంగి వానాకాలం సీజన్ ల్లో సంఘ పరిధిలోని 12గ్రామాలలో మొత్తం మూడు లక్షల ఇరవై ఏడు వేయిల క్వింటాళ్ల వరి ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు. అలాగే గునుకులపల్లిలో పెట్రోల్ పంపు నిర్మాణం, మండల కేంద్రంలోని కార్యాలయం మొదటి అంతస్తు నిర్మాణం పనులు జరుగుతున్నట్లు తెలిపారు. సహకార సంఘాల ద్వారా వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ, ఎరువులను విక్రయిస్తూ రైతులకు అండగా నిలుస్తున్నట్లు చెప్పారు.ఎరువుల వ్యాపారం చిగురుమామిడి, ఇందుర్తి, రేకొండ సెంటర్ ల ద్వారా అందించడం జరిగిందన్నారు. రైతుల సమిష్టి కృషితోనే సహకార సంఘం అభివృద్ధి చెందుతుందని, రైతులు తీసుకున్న రుణాలను సకల చెల్లించి సంఘం అభివృద్ధికి కృషి చేయాలని రమణారెడ్డి కోరారు. ఈ వార్షిక సభలో సంఘ ఉపాధ్యక్షులు కరివేద మహేందర్ రెడ్డి, పాలకవర్గ సభ్యులు ముద్రకోల రాజయ్య, తాళ్ళపెల్లి తిరుపతి, కూతురు రవీందర్ రెడ్డి, అందె స్వామి, పోతరవేని శ్రీనివాస్, చాడ శ్రీధర్ రెడ్డి, మాచమల్ల లచ్చవ్వ , పేరాల లక్ష్మీ, సంఘ సెక్రెటరీ కాటం నర్సయ్య,సంఘము సిబ్బంది శ్రీనివాస్, కుమారస్వామి, లింగయ్య, పవన్, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *