Venkateshwar: ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి : స్టెప్ అధికారి వెంకటేశ్వర్లు

సిరా న్యూస్, బోథ్‌
ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి : స్టెప్ అధికారి వెంకటేశ్వర్లు

ఓటు హక్కు ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని జిల్లా యువజన స‌ర్వీసుల శాఖ ( స్టెప్) అధికారి వెంకటేశ్వర్లు అన్నారు. మంగ‌ళ‌వారం ఆదిలాబాద్ జిల్లా బోథ్ కేంద్రంలో ఓట‌ర్ల‌కు ఓటు విలువ గురించి జిల్లా యువజన స్టెప్ అధికారి వెంకటేశ్వర్లు వివ‌రించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకొని, వారికి నచ్చిన అభ్యర్థుల కు ఓటు వేసుకునే అధికారం ఉందని ఆయన పేర్కొన్నారు. అనంత‌రం త‌హ‌సీల్దార్ సుభాష్ చంద్ర, సిఐ రమేష్, ఎస్ఐ రాము , ఎంపీడీవో రమేష్, ఎంపీ ఈవో మహేందర్ రెడ్డి, ఈవో అంజయ్య, ఏపీఎం మాధవ్ లతోపాటు లక్ష్మీ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు మాసం అనిల్ సభ్యులు ర్యాలీ నిర్వ‌హించారు. ఓటు హక్కు గురించి వివరించారు. పట్టణంలోని పలు వ్యాపారులకు ఓటు హక్కు గురించి వివరించారు. ఓటు వేయడం ప్రతి ఒకరి బాధ్యత అని తెలిపారు.ఓటింగ్ శాతం మరింతగా పెంచాలన్న ఉద్దేశంతో ఈ ర్యాలీ నిర్వహించడం జరిగిందని తాసిల్దార్ పేర్కొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *