సిరాన్యూస్,సైదాపూర్
ఉపాధ్యాయులను సన్మానించిన వెన్నంపల్లి హైస్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు
సైదాపూర్ మండలంలోని వెన్నంపల్లి హైస్కూల్లో ఇటీవల బదిలీపై వెళ్లిన ఏడుగురు ఉపాధ్యాయులు టి.విజయ, జి.సత్యం, వి.శివకుమార్, ఏం. శ్రీనివాస్, వి.శారదాదేవి, వి.శ్రీనివాస్, ఈ. రవీందర్ లకు విద్యార్థులు, పాఠశాల ఉపాధ్యాయ కలిసి వీడ్కోలు సమావేశ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆర్. ప్రభాకర్ రెడ్డి అధ్యక్షత వహించగా, ముఖ్యఅతిథిగా మండల విద్యాధికారి కె.శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. ప్రధానోపాధ్యాయులు ప్రభాకర్ రెడ్డి, మండల విద్యాధికారి కె. శ్రీనివాస్ మాట్లాడుతూ బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులు తమ సేవలను ఇంకా ఉన్నతంగా వినియోగించుకుని విద్యార్థులను ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దాలని కోరారు. ఉపాధ్యాయులు చెప్పిన ప్రతి అంశాన్ని తూచ తప్పకుండా పాటిస్తే విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని తెలిపారు. బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులు వారి అమూల్యమైన సేవలను విద్యార్థులకు కూలంకుషంగా వివరిస్తూ వారికి సలహాలు సూచనలు ఇస్తూ దిశా నిర్దేశం చేశారు. ఇటీవల పదవ తరగతి పూర్తి అయిన విద్యార్థులు కూడా ఈ కార్యక్రమానికి హాజరై ఉపాధ్యాయులను సన్మానించారు. అనంతరం బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులు విద్యార్థులందరికీ వారి గుర్తుగా వాటర్ బాటిళ్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ రెడ్డి, గోపాల్ సింగ్, ప్రవీణ్ కుమార్, సత్య, రమేష్, జయప్రద, పద్మ, జ్యోతి ఉన్నారు.