Veterinary Officer Mallesham: రైతులు పాడి పెంపకంపై దృష్టి సారించాలి : మండల పశు వైద్యాధికారి మల్లేశం

సిరాన్యూస్‌, ఓదెల
రైతులు పాడి పెంపకంపై దృష్టి సారించాలి : మండల పశు వైద్యాధికారి మల్లేశం

రైతుల వ్యవసాయoతో పాటు పాడి పశువుల పెంపక పై దృష్టి సారించాలని ఓదెల మండల పశు వైద్యాధికారి మల్లేశం సూచించారు. సోమ‌వారం కరీంనగర్ పశుగణాభివృద్ధి సంస్థ సూప‌ర్‌వైజ‌ర్ రాఘవ ఆధ్వర్యంలో పిట్టల ఏల్లయ్యపల్లి గ్రామం లో కృత్రిమ గర్భధారణ ద్వారా జన్మించిన దూడల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా రాఘవ మాట్లాడుతూ పాడి రైతులకు దూడల పెంపకంపై అవగాహన కల్పించారు. నట్టలనివారణ మందులను, మినరల్ మిక్చర్ పౌడర్ ను అందించారు. గోపాలమిత్ర ద్వారా పశువులకు కృత్రిమ గర్భధారణ ద్వారా ఆడ దూడలు జన్మించే వీర్యం అందుబాటులోకి వచ్చిందిన్నారు. దీని విలువ 600 రూపాయలు ఉంటుందని ప్రభుత్వ రాయితీపై రైతులకు 250 రూపాయలకే అందిస్తున్నామని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ శిబిరంలో పశువులకు గర్భకోశ వ్యాధి చికిత్సలు 42, కృత్రిమ గర్భధారణ 4, దూడల నట్ట నివారణ మందులు 26, తాగించారు. కార్యక్రమంలో గోపాలమిత్రులు ప్రవీన్, ఓదేలు,మహేశ్, పశుసంవర్ధక శాఖ ఆఫీస్ సిబ్బంది ,మునేదర్, గణేష్, డైరీ ప్రెసిడెంట్ యాదగిరి స్వామి,పాడి రైతులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *