విద్యారత్న అవార్డు ప్రధానం

 సిరా న్యూస్,కమాన్ పూర్;
గోదావరిఖని పట్టణం లో ఈ నెల 4వ తేదీ ఆదివారం రోజున ఆర్ సి ఓ క్లబ్ లో వైద్య, విద్య, సామాజిక సేవ, సాహిత్య కళ రంగాలలో విశిష్ట సేవ అందిస్తున్న వారికీ బిట్ -బిట్ డాన్స్ అకాడమీ దేవా కళా బృందం వారు తెలంగాణ రాష్ట్ర పురస్కారాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం లో భాగంగా 35 సంవత్సరాలుగా విద్య రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న మందమర్రి అంగడిబజార్ కుచెందిన ప్రశాంతి విద్యానికేతన్ స్కూల్ వ్యవస్థాపకులు అనవేన వెంకటరమణి -శంకర్ గార్లకు విద్య రత్న అవార్డు అందచేసి శాలువా తో సత్కరించడం జరిగింది, ఈ కార్యక్రమం లో రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ,నక్షత్ర ఇన్ఫ్రా చెర్మెన్ కాంపాటి అనిల్, బిట్ బిట్ డాన్స్ అకాడమీ దేవా కళా బృందం వ్యవస్థాపకులు తుమ్మల విజయ్, గ్రాండ్ మాస్టర్ పులిపాక దేవేందర్, డాన్స్ మాస్టర్ వీర్ల ప్రశాంత్, తెలంగాణ ధూమ్ దాం అంతడుపుల నాగరాజు , జబర్దస్త్ ఫెమ్ వెంకీ మంకి, యూట్యూబ్ స్టార్ వర్షిణి, మ్యాజిక్ రాజ, గోదావరిఖని కళా సంఘాల అధ్యక్షులు కనకం రమణయ్య పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *