సిరా న్యూస్,హైదరాబాద్;
సంతోష్ నగర్ లోని మెడికల్ షాపులపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించా రు. డ్రగ్ అధికారి అనిల్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి మెడికల్ షాపును క్షుణ్ణంగా తనిఖీ చేశారు. మెడికల్ షాపులో నిబంధనలు పాటించడం లేదని ఫిర్యాదులు రావడంతో తనిఖీలు చేపట్టినట్లు అదికారులు తెలిపారు.. ఫార్మాసిస్ట్ ద్వారా మందులు విక్రయించాల్సి ఉండగా, ఫార్మాసిస్ట్ లేరన్నారు. స్టాక్ రిజిస్టర్, లేబర్ లైసెన్స్, ఫుడ్లైసెన్స్, పర్చేస్ వివరాలతో ఉండాల్సిన రిజిస్టర్లు సక్రమంగా లేవన్నారు. జనరిక్ మెడిసిన్స్ వేరుగా విక్రయించాల్సి ఉన్నప్పటికి, అలా జరగడం లేదన్నారు. పలు రకాల మందులను గుర్తించామన్నారు.