సిరా న్యూస్,హైదరాబాద్;
కాళేశ్వరం పై విజిలెన్స్ విచారణ మొదలయింది. ఈఎన్సీ C మురళి దర్ రావు ఆఫీస్ లో విజిలెన్స్ అధికారుల సోదాలు జరిపారు. మేడి గడ్డ కుంగుబాటు, ఇతర ప్రాజెక్టు డాక్యుమెంట్స్ ను అధికారులు పరిశీలించారు.పది ప్రత్యేక విజిలెన్స్ బృందాలతో తనిఖీలు జరుపుతున్నారు. హైదరాబాద్ తో పాటు జిల్లా ఇరిగేషన్ కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్ట్ కార్యాలయాల్లోవిజిలెన్స్ అండ్ ఫోర్స్ మెంట్ తనిఖీలు జరిగాయి. మహాదేవపూర్ లోని ఇరిగేషన్ డివిజన్ కార్యాలయంలో రికార్డులు & విలువైన పత్రాలను అధికారుల బృందం పరిశీలించింది.మెడిగడ్డ బ్యారేజీ, కన్నేపల్లి పంప్ హౌజ్ లకు సంబంధించిన కార్యాలయాల్లో అధికారుల బృందాలు తనిఖీలు చేసారు