సిరా న్యూస్, ఓదెల
గడ్డ వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించండి : పెద్దపెల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు
కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించాలని పెద్దపెల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. సోమవారం ఓదెల మండలంలోని కొలనూరు, గోపరపల్లి గ్రామాల్లో మహాత్మా గాంధీ ఉపాధి హామీ కూలీలను కలిసి కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణని భారీ మెజారిటీతో గెలిపించాలని పెద్దపెల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు కోరారు. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ ప్రవేశపెట్టిన 5 న్యాయ గ్యారంటీలను వివరించారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఏకకాలంలో రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని, అదే విధంగా వర్షాకాలం పంట నుండి రైతులకు 500 రూపాయల బోనస్ చెల్లిస్తామని తెలిపారు. స్వామినాథన్ కమిటీ రిపోర్ట్ ఆధారంగా ప్రతి పంటకు మద్దతు ధరతో పాటు చట్టబద్ధత కల్పిస్తామని తెలిపారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి పేద మహిళ బ్యాంకు ఖాతాలో లక్ష రూపాయలు వేస్తామన్నారు.కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలోకి రాగానే వంద రోజులు ఉన్న ఉపాధి కూలీ పని దినాలను 200 రోజులు చేస్తామని, రోజువారి కూలీ 400కు పెంచుతామని తెలిపారు. 13వ తేదిన జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి, ఓదెల ఎంపిటిసి బోడకుంట లక్ష్మి చిన్న స్వామి, మాజీ ఎంపిటిసి బోడకుంట శంకర్, .చీకట్ల మొండయ్య, గొపు నారాయణరెడ్డి , ఢిల్లీ శంకర్ బైరి రవికుమార్ , పరుష రమేష్, పెద్దపల్లి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గుండేడి ఐలయ్య యాదవ్ , ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ఉపాధి హామీ కూలీలు తదితరులు పాల్గొన్నారు.