సిరాన్యూస్, ఓదెల
ఎల్లమ్మతల్లి బోనాల ఉత్సవాల్లో ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు
ఓదెల మండలం రూపు నారాయణపేట గ్రామంలో గౌడ కుల సంఘం అధ్యక్షులు సమ్మయ్య ఆధ్వర్యంలో ఐదేళ్లకోసారి జరిగే ఎల్లమ్మ తల్లి బోనాలను బుధవారం ఘనంగా జరుపుకున్నారు .ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్థానిక పెద్దపెల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు హాజరయ్యారు. ఎమ్మెల్యేను గౌడ సంఘం అధ్యక్షులు సమ్మయ్య శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో రూపు నారాయణపేట తాజా మాజీ సర్పంచ్ అంకం రమేష్, పొత్కపల్లి సింగిల్ విండో చైర్మన్ ఆళ్ల సుమన్ రెడ్డి, బొంగోని శ్రీనివాస్, రెడ్డి రజనీకాంత్, గుర్రం పరుశురాం, అరెల్లి కుమార్ తదితరులు పాల్గొన్నారు.