సిరాన్యూస్, ఓదెల
త్వరలోనే డబుల్ బెడ్ రూమ్ల ఇండ్ల పంపిణీ :ఎమ్మెల్యే విజయ రమణారావు
డబుల్ బెడ్ రూంలను సందర్శన
పెద్దపల్లి పట్టణంలోని హనుమంతుడు పేట రోడ్డు మార్గంలో, చందపల్లి ప్రాంతాల్లో నిర్మించి ఉన్న పలు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను శుక్రవారం పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు సందర్శించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే విజయ రమణారావు మాట్లాడుతూ అర్హులైన నిరుపేద కుటుంబాలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని అనే ఉద్దేశంతో డబుల్ బెడ్ రూం ఇండ్లను పరిశీలించామని తెలిపారు. ఆ ప్రాంతంలో తాగునీరు, కరెంటు , డ్రైనేజీ రోడ్డు లాంటి ప్రధాన సమస్యలు ఉండడంతో సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే సమస్యలు లేకుండా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించినట్లు తెలిపారు.త్వరలోనే పూర్తి స్థాయిలో పనులు అన్నీ పూర్తి చేసి అర్హులైన పేద కుటుంబాలకు ఇండ్లు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, విద్యుత్ అధికారులు, ప్రభుత్వ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్దిదారులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.