సిరా న్యూస్, ఎలిగేడు
బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలి
* ఎమ్మెల్యే విజయరమణ రావు
* బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్ ఆవిష్కరణ
పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం శివపల్లి గ్రామంలోని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు నివాసంలో శనివారం బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్‌ను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఓదెల శ్రీ. మల్లిఖార్జున స్వామి దేవస్థానములో ఈనెల 5 నుంచి 15వ తేదీ వరకు మల్లిఖార్జున స్వామి వార్ల బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ బ్రహ్మోత్సవాల కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనీ బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయగలరని కోరారు.ఈ కార్యక్రమంలో ఓదెల ఆలయ సిబ్బంది ముద్దసాని కుమారస్వామి, ప్రధాన అర్చకులు ధూపం వీరభద్రయ్య, పంచాక్షరి, ఆలయ కమిటీ చైర్మన్ మేకల మల్లేశం, కమిటీ సభ్యులు చింతం వెంకటస్వామి మొగిలి, డాక్టర్ సతీష్. తదితరులు పాల్గొన్నారు.