Vijayaraman Rao: గురుకుల విద్యార్థులను పరామర్శించిన పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు

సిరాన్యూస్‌, ఓదెల
గురుకుల విద్యార్థులను పరామర్శించిన పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు

ఓదెల శనివారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని శాస్త్రి నగర్ గురుకుల పాఠశాలలోని విద్యార్థులు ఫుడ్ పాయిజన్ తో అస్వస్థతకు గుర‌య్యారు. ఈవిష‌యం తెలుసుకున్న పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు సుల్తానాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి విద్యార్థుల‌ను పరామర్శించారు. అనంతరం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులు తెలుసుకొని మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించారు. ఫుడ్ పాయిజన్ ఘటనకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు తగిన నాణ్యమైన వసతులను కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *