సిరాన్యూస్, సైదాపూర్:
వెన్నంపల్లి గ్రామ స్పెషల్ ఆఫీసర్ గా కే విజేందర్ రావు
* బాధ్యతల స్వీకరణ
సర్పంచుల పదవీకాలం ముగియడంతో సైదాపూర్ మండలం వెన్నంపల్లి గ్రామం స్పెషల్ ఆఫీసర్ గా కే విజేందర్ రావు శనివారం బాధ్యతలు చేపట్టారు. ఈసందర్భంగా ఆయనకు పంచాయతీ కార్యదర్శి పోరెడ్డి నరేందర్ రెడ్డి పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు.కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి పోరెడ్డి నరేందర్ రెడ్డి , సిబ్బంది పాల్గొన్నారు.