కుదిరి గ్రామ సర్పంచ్ బుంగ చెంగయ్య రైలు కింద పడి దుర్మరణం
సిరా న్యూస్,సూళ్లూరుపేట;
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండలం కుదిరి గ్రామ సర్పంచ్ బుంగ చెంగయ్య శనివారం ఉదయం సూళ్లూరుపేట రైల్వే స్టేషన్ సమీపంలోని రైల్వే పట్టాలపై శవమై కనిపించాడు, సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని సూళ్లూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలియజేశారు, సర్పంచ్ మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.