సిరా న్యూస్,అదిలాబాద్;
లుల సంరక్షణ కోసం కవ్వాల్ అభయారణ్యం ఏర్పడినప్పటి నుండి పులి కోసం, పులుల సంతతి ఎదుగుదల కోసం అటవి అధికారులు చేపట్టిన చర్యల్లో భాగంగా పులులకు ప్రశాంత వాతావరణ కల్పించనున్నారు.
కవ్వాల్ అభయారణ్యంలోని దట్టమైన మారుమూల ప్రాంతంలో నివసించే వివిధ గ్రామాల ప్రజల తరలింపు కోసం చేపట్టిన చర్యలు సఫలం అవుతున్నాయి, గ్రామాల్లోని ప్రజలు అడవి వదిలి అడవి బయట నివసించేందుకు సకల సదుపాయాలతో పునరావాస గ్రామాలు ఏర్పాటు చేస్తున్నారు, ఈ క్రమంలో మొదటి దశ ఎంపిక చేసిన గ్రామాలు తరలింపునకు సిద్ధమయ్యాయి.దేశంలోని 42వ పులుల అయారణ్యముగా ఏర్పడిన కవ్వాల్ జాతీయ పులుల సంరక్షణ కేంద్రంగా పరిగణిస్తున్నారు. ఈ సంరక్షణ కేంద్రం ఉమ్మడి ఆదిలాబాద్ లోని నిర్మల్, అదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల దట్టమైన అడవి ప్రాంతంలో అభయారణ్యం ఏర్పడింది.2015 చదరపు కిలోమీటర్లు ఉన్నటువంటి కవ్వాల్ పులుల అభయారణ్యంలో892 కిలోమీటర్లు కోర్ ఏరియా గాను, 1124 కిలోమీటర్లు బఫర్ ఏరియాగా పరిగణించారు, ఇందులో 21 అటవీ గ్రామాలను అభయారణ్యం నుండి మైదాన ప్రాంతంలోకి తరలించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.కోర్ ఏరియాలో ఉండే గ్రామాలలో అత్యంత చట్టమైన అడవి ప్రాంతంలో గల గ్రామాలు మైసంపేట్, రాంపూర్ గ్రామాలను తక్షణం తరలించి పునరావస కేంద్రాలు ఏర్పాటు చేయాలని గత మూడేళ్లుగా ప్రణాళికలు సిద్ధం చేశారు.ఇక్కడ నివసించే 48 కుటుంబాలకు లక్షలు చొప్పున పరిహారం అందించడానికి చెక్కులను తయారు చేశారు. కొన్ని కుటుంబాలకు 166 చదరపు గజాలలో ఇండ్లు, రెండున్నర ఎకరాల భూమిని ఇవ్వడానికి ఒప్పందం చేసుకున్నారు. ఒప్పందం ప్రకారం నిర్మల్ మంచిర్యాల రహదారిని అనుకోని ఉండే కడం మండలంలోని కొత్త మదిపడగ గ్రామ శివారులో ఇంటిని నిర్మించి సకల సౌకర్యాలు ఏర్పాటు చేసి పంపిణీకి సిద్ధం చేశారుఉమ్మడి అదిలాబాదులో ఏర్పడిన కవ్వాల్ అభయారణ్యంలో పులులు ప్రశాంతంగా జీవించి వాటి సంతతిని కాపాడడానికి అటవీ అధికారులు దట్టమైన అడవుల్లో ఎలాంటి సౌకర్యాలు లేని అడవుల్లో, కనీసం విద్యుత్ , రోడ్డు, మంచినీరు, సౌకర్యం లేని గ్రామాల్లో వ్యవసాయంపై ఆధారపడి జీవించే గ్రామస్తులను చైతన్య పరిచి వారికి కనీస మౌలిక సదుపాయాలు కల్పించి వారికి ఉద్యోగావశాలను ఇస్తూ అటవీ అధికారులు తరలింపుకు సిద్ధం చేశారుపునరావాస గ్రామాలను వారికి చేపట్టి సౌకర్యాలను తుది దశకు చేరుకున్న రెండు పడకల ఇళ్లను రాష్ట్ర అటవీ శాఖ చీఫ్ డుబ్రియల్ ఆదివారం సందర్శించారు, ఈ మేరకు పలు సూచనలు చేశారు, అతి త్వరలోనే అటవీ ప్రాంతంలో ఇన్నాళ్లు నివసించి మైదాన ప్రాంతానికి వస్తున్న గిరిజన ప్రజలను అన్ని సౌకర్యాలు కల్పించి తల్లింపు ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలిపారు. ఆయన వెంట జిల్లా అధికారులు, రాంపురం మైసంపేట గ్రామస్తులు తదితరులు ఉన్నారు.