సిరా న్యూస్, భీమదేవరపల్లి
చలో కరీంనగర్‌కు బయలుదేరిన బీఆర్ఎస్ నాయకులు
మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభను విజయవంతం చేయడం కోసం మంగళవారం భీమదేవరపల్లి మండలంలోని మల్లారం గ్రామంలో బీఆరెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో బయలుదేరారు..ఈ సందర్బంగా గ్రామంలో బీఆరెస్ నినాదాలతో మారుమోగింది.. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు చింత రాజు, మాజీ సర్పంచులు గూడెల్లి రాజిరెడ్డి, గిరిమల్ల తిరుపతి, మాజీ ఉపసర్పంచ్ తిరుమల రెడ్డి, సీనియర్ నాయకులు, నోముల రమేష్, నాగిళ్ళ శ్రీకాంత్, నీలం రాజయ్య, గోపగోని మొగిలి, గరిగే సారయ్య, కోతి శేఖర్, లింగస్వామి, నవీన్, నరహరి, శ్రీను, తదితరులు పాల్గొన్నారు.