సిరాన్యూస్, సిద్ధిపేట
మార్నింగ్ వాక్‌లో పాల్గొన్న ఎంపీ అభ్యర్థి
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని ఎల్లమ్మ చెరువు కట్టపై, మల్లె చెట్టు చౌరస్తా, గాంధీ రోడ్డు, అంబేద్కర్ చౌరస్తా కూడలిలో మార్నింగ్ వాక్ లో కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ మాజీ హుస్నాబాద్ శాసనసభ్యులు సతీష్ కుమార్ పాల్గొన్నారు. చేసిన అభివృద్ధిని చూసి ఓటేయాలన్నారు. ప్రశ్నించే గొంతు పార్లమెంటులో ఉండాలని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ వస్తేనే మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. కార్యక్రమంలో హుస్నాబాద్ బీఆర్ఎస్ నాయకులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.