సిరాన్యూస్, హుస్నాబాద్
ప్రశ్నించే గొంతు పార్లమెంట్ లో ఉండాలి : బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్
ప్రశ్నించే గొంతు పార్లమెంట్ లో ఉండాలని, ఈసారి కరీంనగర్ గడ్డపై ఎగిరేది గులాబీ జెండానే అని కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. శుక్రవారం హుస్నాబాద్ పట్టణంలోని కోర్టు వద్ద బార్ అసోసియేషన్ సభ్యులు, కక్షిదారులను ఆయన కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. హుస్నాబాద్ మాజీ శాసనసభ్యులు వొడితల సతీష్ కుమార్ బీఆర్ఎస్ నాయకులు తదితరులు అన్నారు.