సిరా న్యూస్,పెనమలూరు;
జిల్లాకి సంబంధించిన వరద నష్టం పై కేంద్ర కమిటీ కి నివేదిక ఇవ్వడానికి ముంపు గ్రామాలను పెనమలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ తో కలిసి జిల్లా కలెక్టర్ బాలాజీ పర్యటించారు. ఈ క్రమంలో వరద బాధితులు తమ సమస్యలను జిల్లా కలెక్టర్ కు విన్నవించుకున్నారు. కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ వరద ప్రభావానికి జిల్లాలో పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. వ్యవసాయంతో సహా అన్ని విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించి జరిగిన నష్టాన్ని కేంద్ర కమిటీకి నివేదిక సమర్పిస్తామని అన్నారు.