సిరాన్యూస్, బోథ్
సోనాల వివేకానంద స్కూల్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవం
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని సొనాల వివేకానంద స్కూల్ ఇ/మీ లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో వివిధ రకాల యోగాసనాలు,సూర్య నస్కారాలు,ధ్యానము చేయించడం జరిగింది.
ఈసందర్బంగా పాఠశాల ప్రిన్సిపాల్ కృష్ణ చైతన్య నేడు ప్రపంచ దేశాలు అన్ని యోగాను అనుసరిస్తున్నాయి, జిమ్ కు వెళ్లడం కంటే యోగ అధిక ప్రాధాన్యతను కలిగి ఉందన్నారు. యోగ,ధ్యానం వల్ల విద్యార్థులలో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి మానసిక దృఢత్వం పెరుగుతాయని తెలిపారు. కార్యక్రమంలో డైరెక్టర్లు కోస్మెట్ శుద్ధోధన్, మునిగెల శ్రీధర్,ఉపాధ్యాయ బృందము పాల్గొన్నారు.