సిరా న్యూస్, సొనాల:
వివేకానంద పాఠశాల లో రక్షాబంధన్ వేడుకలు..
ఆదిలాబాద్ జిల్లా సొనాల మండల కేంద్రంలోని వివేకానంద పాఠశాల లో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శనివారం విద్యార్థులు ఒకరికొకరు రాఖి కట్టుకొని, నేను నీకు రక్ష నీవు నాకు రక్ష, మనం అందరమూ దేశానికి రక్షణగా ఉందాము అంటూ శపథం పునారు. ప్రతి ఒక్కరు సోదర సోదరి భావముతో మెలగాలి అని వివేకానంద పాఠశాల ప్రిన్సిపాల్ కృష్ణచైతన్య విద్యార్థులకి తెలియచేసారు. అనంతరం పాఠశాల కరస్పాండెంట్ ఓరగంటి ఇస్తారి మాట్లాడుతూ… సమాజములో సోదరభావంతో పాటు దేశభక్తి , మానవతా విలువలను కాపాడాలి అని విద్యార్థులకి సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కృష్ణ చైతన్య, కరస్పాండెంట్ ఓరుగంటి ఇస్తారి, డైరెక్టర్స్ కోస్మెట్ శుద్ధోధన్, మునిగెల శ్రీధర్, ఉపాద్యాయులు అవినాష్, శ్రీనివాస్, ఆధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.