సిరాన్యూస్, బోథ్
వివేకానంద పాఠశాలలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు
ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని సోనాలలో గల వివేకానంద పాఠశాలలో సోమవాం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు గోపిక, కృష్ణుల వేషధారణలతో గ్రామంలోని వీధుల గుండా వెళుతూ వివిధ పాటలకు నృత్యాలు చేస్తూ,అక్కడక్కడ ఉట్టీలు పగలగొట్టారు. చిన్నారుల గోపికా కృష్ణుల వేషధారణలు చూడటానికి గ్రామంలోని ప్రజలు, పోషకులు వీదులలోకి రావడం జరిగింది. చివరికి పాఠశాలలో పూజా ,ఉట్టి పగలగొట్టే కార్యక్రమం చేపట్టారు. అనంతరం ప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కృష్ణ చైతన్య, ఒరుగంటి ఇస్తారి, కోస్మెట్ శుద్దోధన్, మునిగెల శ్రీధర్, ఉపాధ్యాయులు అవినాష్, శ్రీనివాస్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థినీ విద్యార్థులు, గ్రామ ప్రజలు, పోషకులు పాల్గొన్నారు.