vivekananda shool sonala:వివేకానంద పాఠశాలలో ఘనంగా జాతీయ రైతు దినోత్సవం..

సోనాల,సిరా న్యూస్:

వివేకానంద పాఠశాలలో ఘనంగా జాతీయ రైతు దినోత్సవం..

వివేకానంద స్కూల్ ఇంగ్లీష్ మీడియం, సోనాల లో జాతీయ రైతు దినోత్సవం ను ఘనంగా  నిర్వహించారు. డిసెంబర్ 23 న దేశవ్యాప్తంగా ప్రతి ఏటా జాతీయ రైతు దినోత్సవంను నిర్వహిస్తారు.భారతదేశ 5వ ప్రధానమంత్రి, ‘భారతదేశపు రైతుల విజేత’ గా గుర్తింపుపొందిన చౌదరి చరణ్ సింగ్ పుట్టినరోజు సందర్భంగా ఈ జాతీయ రైతు దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి గ్రామంలోని ఇద్దరు రైతులను అతిథులుగా పిలిచి వారిని సన్మానించడం జరిగింది. విద్యార్థులచే వ్యవసాయంలోని వివిధ దశలను పరికరాలు, పటాల సహాయంతో వివరించడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో విద్యార్థులచే నమూనా కూరగాయల మార్కెట్ను ఏర్పాటు చేయడం జరిగింది అతిథులుగా వచ్చినటువంటి రైతులు ఈ నమూనా మార్కెట్ను సందర్శించి, విద్యార్థులతో ముచ్చటించారు.దీనిలో విద్యార్థులు చాలా ఉత్సాహంగా పాల్గొని, కూరగాయలను అమ్మడం, కొనుగోలు చేశారు..ఈకార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కృష్ణ చైతన్య,యాజమాన్య సిబ్బంది:ఓరుగంటి ఇస్తారి,కోస్మెట్ శుద్ధోధన్, ఉపాధ్యాయులు: స్నేహిక,యోగిత,సౌమ్య,దివ్య,నిత్య,ప్రవళిక విద్యార్థులు తదితరులు  పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *