Voditala Pranav Babu: మార్నింగ్ వాక్‌లో స‌మ‌స్య‌లు తెలుసుకున్నకాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ బాబు

సిరా న్యూస్, హుజురాబాద్:
మార్నింగ్ వాక్‌లో స‌మ‌స్య‌లు తెలుసుకున్నకాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ బాబు

హుజురాబాద్ పట్టణంలోని హైస్కూల్ గ్రౌండ్ లో శుక్రవారం హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ బాబు మార్నింగ్ వాక్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వాకర్స్ తో మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి సమస్యలు వచ్చిన తన దృష్టికి తీసుకురావాలని అన్నారు. ప్రభుత్వ అధికారులతో మాట్లాడి ఆ సమస్యను త్వరగా పరిష్కరిస్తామని, అలాగే వాకర్స్ కోసం డ్రైనేజీ వ్యవస్థ మరియు హై లైటింగ్స్ ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *