చిగురుమామిడి, సిరా న్యూస్
వయోజనులైన ప్రతిఒక్కరు ఓటుహక్కు నమోదు చేసుకోవాలని తహసీల్దార్ ఇప్ప నరేందర్ అభిప్రాయపడ్డారు. 18 సంవత్సరాలు నిండిన వయోజనులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని సూచించారు. మండలంలోని చిన్న ముల్కనూర్ మోడల్ స్కూల్లో జాతీయ ఓటరు దినోత్సవాన్ని నిర్వహించారు. ఓటు హక్కును నమోదు చేసుకొని ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటాలని తెలిపారు. కార్యక్రమంలో ఎస్సై బండి రాజేష్, ఎంపీడీవో నరసయ్య, మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ కొడిమ్యల శ్రీనివాస్, రెవిన్యూ అధికారులు, అధ్యాపక బృందం విద్యార్థులు పాల్గొన్నారు.