స్వయం సహాయక సంఘాల డబ్బులు తీసుకుని పరారైన వి వో ఏ,

లబోదిబోమంటున్న మహిళలు
సిరా న్యూస్,భద్రాద్రి కొత్తగూడెం;
జూలూరుపాడు మండలం కరివారిగూడెం గ్రామానికి చెందిన మహిళలు లబోదిబోమంటున్నారు. గ్రామానికి చెందిన గ్రామదీపిక మరియు బ్యాంక్ మిత్ర అయిన దుర్గారావు అనే వ్యక్తి మహిళా సంఘాల వద్ద నెల నెల పొదుపు డబ్బులు బ్యాంక్ లో జమ చేయడానికి వసూలు చేసి బ్యాంక్ మిత్ర కూడా అతనే కావడంతో అతని దగ్గరే ఉంచుకుని సుమారు 8 నెలల పాటు సుమారు 25 లక్షల రూపాయలు బ్యాంక్ లో జమ చేయకపోవడంతో సదరు సంఘాలకు చెందిన మహిళలకు బ్యాంక్ నుండి అధికారులు నోటీసులు జారీ చేశారు. దీనితో నోటీసులు అందుకున్న మహిళలు ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఇవ్వేకుండా స్త్రీ నిధిలో జమ చేయాల్సిన 25 లక్షల రూపాయలు కూడా జమ చేయకపోవడంతో లబోదిబోమంటున్నారు. రోజు వారీ కూలి పనులు చేసుకుంటూ డబ్బులు పొదుపు చేసుకోవడానికి బ్యాంక్ మిత్రాకు చెల్లిస్తే బ్యాంక్ లో జమ చేయకపోగా తిరిగి తమకే బ్యాంక్ అధికారులు నోటీసులు ఇవ్వడం ఏంటని సుజాతనగర్ మండలం సుజాతనగర్ ఏపిజివిబి బ్యాంక్ కు వెళ్లి గొడవకు దిగారు. గతంలో బ్యాంక్ లో జమ చేయలేదని తెలిసి విఓఏ అయిన దుర్గారావు ను నిలదీయడంతో బ్యాంక్ అధికారులే అతనికి సమయం ఇవ్వండి అని బ్రతమిలాడి తీరా ఇప్పుడు అతను కనిపించకుండా పరారు కావడంతో మమ్మల్ని డబ్బులు కట్టాలి అని నోటీసులు ఇవ్వడం అన్యాయం అంటూ ఆగ్రహించారు. దీనితో బ్యాంక్ కు కొత్తగా వచ్చిన మేనేజర్ వారితో మాట్లాడి పై అధికారులకు సమాచారం ఇచ్చి విచారణ జరిపి న్యాయం చేస్తామని తెలపడంతో మహిళలు అక్కడి నుండి సుజాతనగర్ పోలీసు స్టేషన్ కు వెళ్లి దుర్గారావు పై ఫిర్యాదు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *