సిరా న్యూస్,తిరుమల;
శనివారం తెల్లవారు జామున1:30 నిమిషాలకు శ్రీవారికి విశిష్ట కైంకర్యాల అనంతరం 1:45 నుండి విఐపీలకు దర్శనం కల్పించామని టీటీడీ ఈఓ ధర్మారెడ్డి వెల్లడించారు. దాదాపు 4 వేల మంది పలు రాష్ట్రాల నుండి వివిధ రంగాల్లో ఉన్న వారు తిరుమల కి రావడం జరిగింది. వాళ్లకు అందరికీ స్వామి వారి దర్శనం, వైకుంఠ ద్వారాల దర్శనం చేయించడం జరిగింది. సామాన్య భక్తులకు ఇచ్చిన షెడ్యూల్ ముందే ఆలయంలో స్వామి దర్శనం ప్రారంభించాం. ఏ ఒక్క సామాన్య భక్తులకు వైకుంఠంలో ఇబ్బందులు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశాం. వైకుంఠ ద్వారాలు 10 రోజులు తెరిచే ఉంచుతాం. భక్తులు ఎవరూ ఆందోళన చెందాల్చిన అవసరం లేదని అన్నారు.