జలపాతాన్ని సందర్శించకుండా హెచ్చరిక

ఫ్లెక్సీలు ఏర్పాటు
పెద్దపల్లి ఏసిపి కృష్ణ
సిరా న్యూస్,పెద్దపల్లి;
నిరంతర వర్షపాతం దృష్ట్యా పెద్దపల్లి, బసంత్ నగర్ ఎస్సైలు, పెద్దపల్లి సీఐ కృష్ణతో కలిసి పెద్దపెల్లి ఏసిపి కృష్ణ పెద్దపల్లి మండలం సబితం గ్రామపంచాయతీ పరిధిలోని గౌరిగుండాల జలపాతం, పెద్దబొంకూర్, దస్తగిరిపల్లి, కొత్తపల్లి లోని లోతట్టు ప్రాంతాలను సందర్శించారు. స్థానిక ప్రజలను వర్షపాత పరిస్థితులను అడిగి తెలుసుకుని వారికి పలు సూచనలు చేశారు. అనంతరం నిరంతర వర్షపాతం కారణంగా జలపాతాన్ని సందర్శించకుండా వార్నింగ్ ఫ్లెక్సీలు, బారికేడ్లు ఏర్పాటు చేశారు . ఈ సందర్భంగా పెద్దపల్లి ఏసిపి కృష్ణ మాట్లాడుతూ అవసరమైతే తప్ప ఎవరు బయటకు రాకూడదని, చేపలు పట్టడానికి వెళ్లకూడదని, అదేవిధంగా తడిగా ఉన్న కరెంటు స్తంభాలను ముట్టుకోకూడదని, వాటర్ ఫాల్స్ సందర్శకులు ఎవరూ కూడా ఈ సమయంలో వాటర్ ఫాల్స్ సందర్శనకు రాకూడదని తెలియజేశారు. ఏదైనా ప్రమాద సంఘటన జరిగితే వెంటనే 100 కి కాల్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వలని ఏసిపి కృష్ణ గ్రామస్తులకు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *