తెలంగాణలో నీటి పంచాయితీ

సిరా న్యూస్,హైదరాబాద్;
రాజకీయంగా కొత్త పంచాయితీ ముందుకేసుకుంది. నీళ్లతో నిప్పులు రాజేయడానికి మళ్లీ పోరు బాట పట్టనుంది గులాబీ పార్టీ. త్వరలో నీటి పోరు యాత్ర చేసేందుకు రెడీ అయింది.దక్షిణ తెలంగాణలోని నాగార్జున సాగర్‌, ఉత్తర తెలంగాణలోని కాళేశ్వరం నుంచి నీటి పోరు యాత్ర ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. యాత్ర ముగింపు సందర్భంగా హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు బీఆర్‌ఎస్‌ పెద్దలు ప్లాన్‌ చేశారు.ఇటీవలే కృష్ణా ప్రాజెక్టులు కేఆర్‌ఎంబీకి అప్పగించడంపై నల్గొండలో బీఆర్‌ఎస్‌ భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభ సక్సెస్‌తో జోష్‌లో ఉన్న బీఆర్‌ఎస్‌ ఇదే ఊపులో నీటి పోరు యాత్ర చేసి తమ పాలనకు, కాంగ్రెస్‌ పాలనకు ఉన్న తేడాను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కారు పార్టీ డిసైడైనట్లు కనిపిస్తోంది. తెలంగాణ కోసం కొట్లాడేది కేవలం బీఆర్‌ఎస్‌ పార్టీ మాత్రమేనని ఎన్నికల వేళ మరోసారి ప్రజలకు గుర్తుచేసేందుకే ఈ యాత్ర అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.ఇదిలావుంటే, స్వతంత్ర్య భారతవనీలో కనువినీ ఎరుగని జలదోపిడి. నీటి పేరుతో నోట్ల కట్టలను వెనకేసుకున్నారంటూ ఇటీవల శాసనసభ సాక్షిగా ప్రస్తుత ప్రభుత్వం. గత ప్రభుత్వంపై విరుచుకుపడింది. అసలే మేడిగడ్డ పేకమైడైందని.. సుందిళ్ల, అన్నారం బ్యారేజ్‌లు కూడా డేంజర్‌లో ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. మరి తాతలనాటి ప్రాజెక్టులు తాపీగా నిలబడ్డా.. ఇప్పటి ప్రాజెక్టులెందుకు కుంగిపోతున్నాయి. ఈ కుంగుబాటుకు కారణం మీరంటే మీరంటూ అసెంబ్లీలో అధికార విపక్షాల మధ్యవాదోపవాదాలు తారాస్థాయిలో జరిగాయి. ఇంతకూ ప్రాజెక్టుల పంచాయితీలో ఎవరి వాదనలో వాస్తవముంది..?నీటి వాటాలపై ఏపీ, తెలంగాణ మధ్య యుద్ధం ఎప్పటి నుంచో జరుగుతున్న ముచ్చట. లేటెస్ట్‌గా తెలంగాణలోనే అధికార, విపక్షాల మధ్య వార్ మొదలైంది. తప్పు నీదంటే నీదంటే ఇరు వర్గాలు వాదించుకుంటున్నాయి. అదే సమయంలో తమపై చేస్తున్న ఆరోపణలను తిప్పికొడుతోంది ఏపీ. తెలంగాణకు రావాల్సిన నీటి వాటాల విషయంలో అన్యాయం జరిగింది. ఆ అన్యాయానికి బీఆర్‌ఎస్సే కారణం అని కాంగ్రెస్ అరోపిస్తోంది. అయితే కాంగ్రెస్ వల్లే రాష్ట్రానికి నష్టం జరుగుతోందని ఆరోపిస్తోంది గులాబీ పార్టీ. ఇదే అంశంపై అటు అసెంబ్లీలో.. ఇటు మేడిగడ్డ గట్టు మీద నుంచి బీఆర్‌ఎస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది అధికార పార్టీ. ఇక నల్గొండ వేదికగా కాంగ్రెస్ పార్టీపై గర్జించారు మాజీ సీఎం కేసీఆర్.మొత్తంగా అటు కేఆర్‌ఎంబీ, ఇటు కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో రాజకీయం భగ్గుమంటోంది. ఈ వివాదం ఎంతవరకూ వెళ్తుందో.. ఎక్కడ ఎండ్ కార్డ్ పడుతుందో చూడాలి మరి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *