సిరా న్యూస్,సంగారెడ్డి;
సింగూరు ప్రాజెక్టు నుండి నీటిని అధికారులు విడుదల చేసారు. ఘనపూర్ ప్రాజెక్ట్ ఆయకట్టు వ్యవసాయ సాగుకు నాలుగో విడత నీటి విడుదల అయింది. ప్రాజెక్ట్ జెన్కో పవర్ ప్లాంట్ స్పిల్ వే గేట్స్ నుండి నీటి అవుట్ ఫ్లో :- 1,460 క్యూసెక్కులు, సింగూర్ ప్రాజెక్టు లెఫ్ట్ కెనాల్ నుండి నీటి అవుట్ ఫ్లో :- 150 క్యూసెక్కులు. ప్రాజెక్టు పూర్తి నీటి సామర్థ్యం :- 29.917 టీఎంసీలు వుండగా ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి నిల్వ :- 22.917 టిఎంసిలుగా ఉంది.