జాతర పనులు ఈ నెల 30 వరకు పూర్తి చేస్తాం
జాతర పనుల పై నాణ్యత ప్రమాణాలు పాటించాలి..మంత్రి సీతక్క..
త్వరలో మేడారం కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..
సిరా న్యూస్,ములుగు;
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం మహా జాతర కు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులూ తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క తెలిపారు.జాతరకు వచ్చే భక్తులు స్వేచ్ఛగా వచ్చి అమ్మవార్లను దర్శించుకొవాలని ఆమె అన్నారు.జాతర అభివృద్ధి పనుల పై కొంత మంది లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ,జాతరలో జరిగే అభివృద్ది పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశామని,ఎటువంటి నాణ్యత లోపాలు ఉన్న వారిపై చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు.గత జాతర కంటే ఈ సారి శాశ్వత నిర్మాణాలు చేపడుతున్నామని ,జాతరలో జరిగే అభివృద్ది పనులను ఈ సారి స్థానికులకు,పూజారులకు ఇచ్చామని,కొన్ని పనులు టెండర్ల ద్వారా ఇచ్చామని మంత్రి సీతక్క అన్నారు. ఈ నెల 30 లోపు పనులు పూర్తి చేస్తామని మంత్రి అన్నారు .ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలో మేడారం కు వస్తారని,ముఖ్యంత్రి రేవంత్ రెడ్డి జాతర అభివృద్ది పనుల పై ఎప్పటి కప్పుడు తెలుసుకుంటున్నారనీ సీతక్క అన్నారు.
సమ్మక్క,సారలమ్మ జాతర కు ఖర్చు లేకుండా,దర్శనం టికెట్ లేకుండ దర్శనం చేసుకునే దేవతలు సమ్మక్క, సారలమ్మ లని మంత్రి అన్నారు.
సమ్మక్క సారలమ్మ జాతర కు అందరూ ఆహ్వానితులే అని సీతక్క అన్నారు.