తెలంగాణ ఇంటర్మీడియట్ నాన్ రేగ్యులరైజ్డ్
సిరా న్యూస్,ముధోల్;
గత ప్రభుత్వం చేసినటువంటి మోసం వల్లే మేము కాంట్రాక్టు ఉద్యోగులుగా మిగిలిపోయామని తెలంగాణ ఇంటర్మీడియట్ నాన్ రేగులరైజ్ కాంట్రాక్టు ఓకేషనల్ జూనియర్ లెక్చరర్లు సంఘం అధ్యక్షుడు అనిల్ అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.. కాంట్రాక్టు లెక్చరర్లు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇప్పటివరకు వేతనాలు ఆగలేదని సీఎం రేవంత్ రెడ్డి పాలనలో మాకు సక్రమంగానే వేతనాలు అందుతున్నాయని అన్నారు. కావాలనే హరీష్ రావు కాంట్రాక్టు ఉద్యోగులపై ప్రభుత్వానికి వ్యతిరేక భావం ఏర్పడేలా వ్యాఖ్యలు చేయడాన్ని ఖండిస్తున్నాం అని అన్నారు. గత బిఆర్ఎస్స్ ప్రభుత్వం కేవలం తమ కార్యకర్తలుగా పని చేసిన వారికి మాత్రమే రెగ్యులరైజ్ చేసి, మిగతా వారిని అసంబద్ధమైన విధానాలను చూపి మమ్మల్ని ఈరోజు కాంట్రాక్ట్ ఉద్యోగులుగా మిగిల్చిన ఘనత ఈ హరీష్ రావుది అనే విమర్శించారు. ఆయనకు కాంట్రాక్టు ఉద్యోగుల జీతాలు, బాగోగుల గురించి మాట్లాడే అర్హత లేదని అన్నారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఓకేషనల్ విభాగంలో క్రమబద్దీకరణకు నోచుకోని 411 మంది అధ్యాపకులకు క్రమబద్దీకరణకు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్నీ వేడుకున్నారు.