వాన కాలం పంట నుండి రైతులకు బోనస్ ఇస్తాం

ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు
సిరా న్యూస్,పెద్దపల్లి;
మండలంలోని తుర్కలమద్ది కుంట గ్రామంలో మంగళవారం పెద్దపల్లి నుండి తుర్కలమద్దికుంట అలాగే తుర్కల మద్దికుంట నుండి కాచాపూర్ వరకు డబల్ రోడ్డు నిర్మాణంతో పాటు ఆంజనేయ స్వామి ఆలయం నుండి మద్దికుంట పాఠశాల చౌరస్తా వరకు 1200 మీటర్ల సి.సి రోడ్డు నిర్మాణానికి కాంట్రాక్టర్లు, సంబంధిత ఇంజనీరింగ్ శాఖ ఎ.ఈ, గ్రామస్తులతో కలిసి పనులను శాసనసభ్యులు చింతకుంట విజయరమణా రావు పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఎమ్మెల్యేను శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే గ్రామ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే విజయరమణా రావు మాట్లాడుతూ గ్రామస్తుల అభిప్రాయం ప్రకారం 33 ఫిట్ల రోడ్డు వెడల్పుతో పాటు రెండు పక్కల డ్రైనేజీ నిర్మాణం కోసం గ్రామస్తుల ఆలోచనతో ముందుకు పోవడం జరుగుతుందని అన్నారు. రోడ్డు వెడల్పు లో భాగంగా 4 నుండి 5 ఇండ్లు సంబందించిన సమస్య ఉంటే తమ గ్రామ నాయకుల సహకారంతో డబల్ బెడ్ రూమ్ ఇండ్లను మంజూరు చేసి వారందరికీ నష్టం కాకుండా చర్యలు తీసుకుంటామని గ్రామస్తులందరి ముందు ఆయన హామీ ఇచ్చారు.
గ్రామంలో ఉన్న సమ్మక్క- సారళమ్మ ఆలయానికి వెళ్లే మార్గంలో పంచాయతీ రాజ్ శాఖ ద్వారా హనుమాన్ విగ్రహం నుండి కెనాల్ ద్వారా మేరపల్లి, తెనుగుపల్లి వెళ్లే మార్గంలో రోడ్డు నిర్మాణం కోసం ప్రపోసల్ చేసినట్లు తెలిపారు. దీంతో పాటు రాబోయే సమ్మక్క సారళమ్మ జాతర వరకు సి.సి రోడ్డు నిర్మాణం పూర్తి చేయడం జరుగుతుందని అన్నారు.కాచాపూర్ నుండి మద్దికుంట మార్గం మధ్యలో ఉన్న 2 కిలో మీటర్ల రోడ్డు నిర్మాణం కోసం సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడం జరిగిందన్నారు. అలాగే ఎన్నికల సమయంలో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ ఇంటి ఇంటికి విజ్జన్న నినాదంతో మద్దికుంట గ్రామానికి వచ్చినప్పుడు గ్రామస్తులు రోడ్డు కావాలని అడగడంతో ఆరోజు ఇచ్చిన మాట ప్రకారం రోడ్డు నిర్మాణం దసరా వరకు పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు. ఏక కాలంలో రైతు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వనిదని ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో వరంగల్ రైతు డిక్లరేషన్ సభలో రాహుల్ గాంధీ 2 లక్షల రుణమాఫీ ప్రకటించారని ఎన్నికల హామీకి కట్టుబడి ఉండి రైతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు లక్షల రుణమాఫీ చేయడం జరిగిందన్నారు. అర్హులైన ప్రతి రైతుకు కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేసి తీరుతుందని ప్రతిపక్షాలు చేసే విమర్శలను రైతుల నమ్మకూడదని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా కొన్నిచోట్ల సాంకేతిక లోపాల వల్ల, మరికొన్ని చోట్ల బ్యాంకుల తప్పిదం వల్ల రైతులకు రుణమాఫీ అందలేదని వాటన్నిటిని సవరించి పూర్తిస్థాయిలో రుణమాఫీ అందజేస్తామని రైతులు నిరాశ చెందవద్దని పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పాతాళ లోకంలో పడదేసిందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నేతలు కొన్నిచోట్ల రైతుల ముసుగులో రుణమాఫీ ఆందోళనలు పాల్పడుతున్నా రని వారికి రైతులే తగిన బుద్ధి చెప్తారని పేర్కొన్నారు. రుణమా ఫీ ఫై తోడు దొంగలైన కేటీఆర్, హరీష్ రావులు అబద్దాలతో పోటీపడి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని అన్నారు. అలాగే కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ నల్ల చట్టాలను తీసుకువచ్చి రైతుల ప్రాణాల ను బలి తీసుకుందని విమర్శించారు. బిజెపి పార్టీ అధికారంలో ఉన్న ఏ ఒక్క రాష్ట్రంలో కూడా రుణమాఫీ చేయలేదని ఎద్దేవా చేశారు..
ఈ కార్యక్రమంలో కాంట్రాక్టర్లు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *