సిరా న్యూస్,హైదరాబాద్;
మన నివసించే ప్రాంతాలు చెత్త రహిత ప్రాంతాలుగా మార్చి స్వచ్ఛ నగరానికి కృషి చేయాలని సోమాజిగూడ కార్పొరేటర్ వనం సంగీత భర్త శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. బుధవారం స్వచ్ఛ సోమాజిగూడ లో భాగంగా రోడ్డు పక్కన పేరుకుపోయిన వారు శానిటేషన్ కార్మికులతో కలిసి తొలగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతాల్లో చిరు వ్యాపారులు తమ వ్యాపారాల వలన వెలువడిన చెత్తను రోడ్లపై వెయ్యకుండా తమ దుకాణాలు దగ్గరకు వచ్చే శానిటేషన్ వాహనాల్లో వెయ్యాలను సూచించారు. ఎక్కడపడితే అక్కడ చెత్త వేయడం వలన దోమల ప్రబలి బారిన పడే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.