– ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మన్
సిరా న్యూస్,పెద్దపల్లి;
వెనుకబడిన దళితులందరికీ అండగా ఉంటామని ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మన్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. మాజీ కౌన్సిలర్ ఈర్ల స్వరూప సురేందర్ ఆద్వర్యంలో పట్టణంలోని ఎన్ఎస్ గార్డెన్లో మాదిగ ఆత్మీయ ఘన సన్మానోత్సవానికి విచ్చేసిన ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం మాదిగల సంక్షేమాన్ని మరిచి, రాజకీయంగా మాదిగలను ఉపయోగించుకున్నదని విమర్శించారు. సహజ సంపదలను దోచుకొని, కోట్లాది రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. తనకు వ్యాపారాలు లేవని, పూర్తి సమయాన్ని నియోజకవర్గ అభివృద్దికి కేటాయిస్తానని తెలిపారు. దళిత కాలనీల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలను ఖచ్చితంగా వందరోజుల్లో పూర్తి చేస్తామని, కరెంటు బిల్లులు ఎవరూ కట్టవద్దని స్పష్టం చేశారు. దళిత జాతి నాపట్ల చూపెడుతున్న ప్రేమకు దాసోహమయ్యాని ఆనందం వ్యక్తం చేశారు. తెలంగాణా ఉద్యమంలో వీరోచిత త్యాగాలకు పాల్పడిన ఈర్ల సురేందర్ త్యాగానికి తగిన ప్రాధాన్యత పార్టీ పరంగా లభించేలా చూస్తామని హామీ ఇచ్చారు. తదుపరి విజయరమణారావుతో పాటు ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మన్ కుమారును సభ్యులు సన్మానించారు. అంతకు ముందు అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాల్వ శ్రీరాంపూర్ మాజీ జడ్పిటీసి గోపగాని సారయ్య గౌడ్, పెద్దపల్లి మాజీ ఎంపిపి సందనవేన రాజేందర్, దళిత ఉద్యోగుల మాతంగి శ్రీనివాస రావు, అడ్లూరి చంద్రశేఖర్, కుక్క నారాయణ, అక్కపాక తిరుపతి, పెర్క రాజేషం, పెర్క రామస్వామి, జనగామ శ్రీధర్, మడిపల్లి శంకరయ్య, శోభ, పెర్క రామస్వామి, వడ్డెపల్లి ఎల్లేష్, ఈర్ల రవీందర్, మాచర్ల వైకుంఠం, కౌన్సిలర్లు నూగిల్ల మల్లయ్య, భూతగడ్డ సంపత్, శ్రీమన్నారాయణ, బొడ్డుపల్లి శ్రీనివాస్, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.